పెళ్ళైన వారిగా ఊహించుకోండి. సులభమా? ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో పెళ్ళైన వారిగా కూడా ఊహించుకోండి- అవును, చాలామంది భారతీయ దంపతుల మాదిరిగా. మీరు మీ భాగస్వామితో సన్నిహితంగా ఉండాలని కోరుకుంటే, మీరు విషయాలను ఎలా సాధ్యం అయ్యేలా చేస్తారు? అని ఎప్పుడైనా ఆలోచించారా? ఊహించుకోగలుగుతున్నారా? మీరు ఎటువంటి కారణం లేకుండా రోజులో మీ భార్యను కౌగిలించుకోవాలనుకుని, కానీ మీరు చేయలేకపోయిన క్షణాలు, యాదృచ్ఛికంగా మీ భాగస్వామిని ముద్దాడాలనే కోరిక వుండి , కానీ మీరు చేయలేకపోయిన క్షణాలు, లేదా TV లో మీకు ఒక శృంగార చిత్రం చూసినప్పుడు మీ భార్య చేతులతో చేతులను కలిపి, మీరు ఆ శృంగార చిత్రాన్ని చూడాలనుకుని, అలా చేయలేకపోయిన క్షణాలు ఖచ్చితంగా ఉండి వుండవచ్చు. కారణం? మీరు ఒక ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారు.
అన్నిటినీ పంచుకుని ఒకే ఇంట్లో నివసించడం అనే భారతీయ కుటుంబ విలువలు సిద్ధాంతపరంగా చూడడానికి బాగా వుంటాయి, కానీ మీరు అన్యోనంగా వుండే యువ జంట అయివుండి, మీరు మీ అత్తగారు, మామగారు, బావగారు మరియు అతని భార్య, వారి పిల్లలు మరియు అప్పుడప్పుడు వచ్చే ఆడపడుచు వుండే ఒకే ఇంటిలో వుంటే, శృంగారభరితంగా ఉండటం మీకు చాలా భారంగా ఉండవచ్చు.
శబ్దాలతో కూడిన శృంగారం మరియు ఉమ్మడి కుటుంబం - ఈ సమస్యను ఎవరైనా ఎలా పరిష్కరిస్తారు అని చట్నీపుడి అడుగుతున్నారు. "ఏడు సుదీర్ఘ సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ మేము శృంగారంలో పాల్గొనడం ఇతరులు వినవచ్చు అనేదాన్ని నా మనస్సులో నుంచి చెరిపి వేయలేకున్నాను" అని ఆమె ఒప్పుకుంటుంది. డాక్టర్ సంజీవ్ త్రివేది ఒక సరళమైన ఆచరణాత్మక ఉదాహరణను ఇస్తున్నారు- "నేపధ్య సంగీతాన్ని ప్లే చేయండి." పెద్ద శబ్దంతో కూడిన సంగీతం ఒక పరిష్కారం కాగలదని సంగీత్ సిన్హా కూడా సూచిస్తున్నారు, అయినా, “తను వ్యక్తిగతంగా ఎప్పుడూ కుటుంబంతో ఉండలేదు కాబట్టి ఈ సమస్యను తనకు అన్వయించుకోలేదు" అని ఆమె అంగీకరిస్తుంది కానీ "ఇది ఇబ్బంది పెట్టగలదు” అని నమ్ముతోంది.
భారతదేశంలోని పేదవారు మరియు అలాంటి ఇతర సమాజాలు పడకగది సౌకర్యం కూడా లేకుండా వుంటారు అయినా వారు వ్యక్తిగత పడకగదులు గల ధనవంతుల కంటే వేగంగా పిల్లల్నికంటారు. "వీరు బయటికి వినబడుతుందేమోన్న భయమును పెద్దగా పట్టించుకోరు," అని తపన్ మొజుందార్ భావిస్తారు. అతను జీవితం 'కళాత్మక' లేదా అటువంటి సినిమాలను అనుకరించదు అని మరియు మనలో పెద్దగా శబ్దాలు చేసే వ్యక్తుల నుండి వచ్చే శబ్దాలు ఒక మంచి నాణ్యత గల తలుపు నుండి వినబడవు అని ఆయన నమ్ముతారు. "తలుపు రెండువైపుల నుండి, ఇది నా అనుభవం," అని అతను ఒక గమ్మత్తైన చిరునవ్వుతో పంచుకున్నాడు.
అది చెప్పడంతో, మనం జరుగుతూ వున్న ఒక క్రూరమైన నేరం గురించి మాట్లాడటం లేదు మరియు అది చాలా రహస్యంగా చేయాలి అని చెప్పడం లేదు. కొన్నిసార్లు మనం పునరుత్పత్తి మరియు ఆహ్లాదం గురించి మాట్లాడుతున్నాము. “ఆలోచనా ధోరణిని బట్టి, తలుపు వెలుపలి నుండి ఉత్సుకత అనేది గిలిగింత లేదా ఇబ్బందికి దారి తీయవచ్చు. లోపల వుండే వారికి, ఉత్సుకతకు ఆశ్చర్యార్థకాలు ఉండడం అవసరం. నిజానికి, ఆనందం ఎంత ఎక్కువ లోతైనది మరియు నిజమైనధైతే, అరుపులు అంత తక్కువగా ఉంటాయి. అరుపులు సాధారణంగా నటనను సూచిస్తాయి; ఉనికిలో లేని భావాలను నకిలీగా ప్రకటించడం. ఏమాత్రం ఉనికిలో లేని జరుగుతూ వున్న సన్నిహితత్వం కోసం ప్రేక్షకులను కలిగి ఉండాలనే ఉద్దేశం కావచ్చు, " అని తపన్ నమ్ముతున్నారు.
నఫల్ ఖాన్ ఇలా జోక్ చేస్తారు, "అప్పుడు వారు విపరీతంగా ప్రవర్తించేలా చేయడానికే మీరు మరింత బిగ్గరగా అరవాలి. నేను అలాగే చేస్తాను.” “కొద్దిగా గట్టిగా అరవండి మరియు మరింత బిగ్గరగా మూలగండి,” అనేది అయేషా సలహా కూడా.
వారి తల్లిదండ్రులు మరియు యుక్త వయసు గల తోబుట్టువులతో పాటు వారు నివసిస్తున్న సందడిగా వుండే 'ఉమ్మడి కుటుంబం' గృహాల కారణంగా, భారతీయ దంపతులు తమకు కావలసినంత తరచుగా శృంగారంలో పాల్గొనడానికి తగినంత గోప్యతను పొందరు అని భారతదేశంలో మెన్స్ హెల్త్ మ్యాగజైన్ నిర్వహించిన ఇటీవలి సర్వే కూడా ధృవీకరించింది.
అయితే ఉమ్మడి కుటుంబంలో శృంగారంలో పాల్గొనడటం నిజంగా అంత చెడుగా ఉంటుందా? బహుశా కావచ్చు, కాకపోవచ్చు - దానిని అనుభవించిన వారు మాత్రమే తీర్పు చెప్పడానికి ఉత్తమ వ్యక్తులు అవుతారు. కానీ మంచం మీద బిగ్గరగా ఉండటం ఇష్టపడే వారికి ఇది నిజంగా కఠినమైనది కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం - బిగ్గరగా అరవడం గురించి మర్చిపోండి, ఒక మృదువైన శృంగారభరిత మూలుగును కూడా గోడ వెనుక వుండే మొత్తం కుటుంబం వినగలరు. కాబట్టి తరువాతిసారి అతను పడక మీద, 'నా పేరును అరువు' అని అంటే, మీరు ఏమి చేస్తారు? ఒక చూపుతో అతనిని నిశ్శబ్దంగా చేస్తారా?