మహిళల కోసం గొప్ప బ్యాక్ టు వర్క్ ప్రోగ్రామ్ లు కల 8 భారతీయ కంపెనీలు

కెరీర్ ని పునఃప్రారంభించడం ఎల్లప్పుడూ ఒక సవాలుగా ఉండింది. మహిళలకు కెరీర్ బ్రేక్ కొరకు వారికుండే కారణాలు ఎక్కువ మటుకు వ్యక్తిగతం కావడం వలన మరియు విరామ వ్యవధి ఎక్కువగా వుండడం వలన పనిలో మళ్ళీ చేరడం అనేది మరీ కష్టతరమైనది. అయితే, మహిళల సామర్థ్యాన్ని అర్థం చేసుకుని, వారి నైపుణ్యాలను మెరుగుపర్చుకొని, కెరీర్ పునఃప్రారంభించడానికి వారికి సమాన అవకాశాన్ని ఇచ్చే సంస్థలు భారతదేశంలో వున్నాయి. గొప్ప బ్యాక్ టు వర్క్ ప్రోగ్రామ్ లు కల అటువంటి 8 సంస్థలు కింద ఇవ్వబడ్డాయి:

సెకెండ్ కెరీర్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ (SCIP) - టాటా

టాటా యొక్క సెకండ్ కెరీర్ ఇంటర్న్ షిప్ కార్యక్రమం మార్చ్ 2008 లో ప్రారంభించబడింది. ఏవైనా కారణాల వలన 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ విరామం తీసుకొని ప్రొఫెషనల్ స్పేస్ లోకి తిరిగి ప్రవేశించాలని కోరుకునే మహిళా నిపుణుల కొరకు ఇది ఒక కెరీర్ ట్రాన్సిజషన్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం. అటువంటి మహిళల కొరకు వివిధ రకాల టాటా గ్రూప్ సంస్థలలో అనువైన పనిగంటలు వుండే అసైన్మెంట్లను తీసుకోవడానికి అవకాశాలను అందిస్తుంది. ఈ కార్యక్రమం మహిళలకు వారి రెండవ ఇన్నింగ్స్ ను కిక్ స్టార్ట్ చేయడానికి పరిపూర్ణ అవకాశం కల్పిస్తుంది.

బ్రింగ్ హర్ బ్యాక్ ప్రోగ్రాం – ఐబిఎం

IBM యొక్క బ్రింగ్ హర్ బ్యాక్ ప్రోగ్రామ్ మధ్యంతర కెరీర్ సెలవు తీసుకున్న మహిళలను ఆకర్షించడానికి ఉద్దేశించినది. అవసరమైన నైపుణ్యములు కలిగిన మహిళా నిపుణురాలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు మరియు గరిష్టంగా మూడు సంవత్సరాల వ్యక్తిగత సెలవుపై వున్న ఎవరైనా సవాలుతో కూడుకున్న ఉన్నత-స్థాయి ప్రాజెక్టులపై పనిచేసే 12 వారాల ఇంటర్న్ షిప్ గల కార్యక్రమానికి అర్హత పొందుతారు.

సెకెండ్ కెరీర్స్ ప్రోగ్రామ్ - కెరీర్స్ 2.0 గోద్రేజ్

కెరీర్స్ 2.0 గోద్రెజ్ చేత ప్రారంభించబడినది, కెరీర్ బ్రేక్ తరువాత  తిరిగి పనిలోనికి రావాలనుకుంటున్న మహిళలకు సహాయం చేస్తుంది. ఈ కార్యక్రమంలో మహిళలకు కనీసం 2 సంవత్సరాలు తగిన పని అనుభవం అవసరం.ఇది ప్రాజెక్ట్ యొక్క స్వభావం ఆధారంగా స్టైపెండ్ మీద పూర్తి సమయం లేదా పార్ట్ టైమ్ ఆధారంగా 3-6 నెలలు ప్రత్యక్ష వ్యాపార ప్రాజెక్టులపై పని చేయడానికి అవకాశం ఇస్తుంది.

కెరీర్ బై చాయిస్-హిందూస్తాన్ లీవర్ లిమిటెడ్ (HUL)

వృత్తి విరామం తరవాత మహిళలను కార్పోరేట్ ప్రపంచం లోనికి తీసుకొని రావవలసిన అవసరం మీద ఆధారపడి ఒక సమగ్ర ట్రాన్షిషణ్ కార్యక్రమాన్ని హిందూస్తాన్ లీవర్ లిమిటెడ్ యొక్క కెరీర్ బై చాయిస్ ఏర్పరుస్తుంది. గోద్రెజ్ కెరీర్స్ 2.0 లాగే 2 సంవత్సరాలు సరైనటువంటి అనుభవం వుండాలి. ఒక ప్రాజెక్ట్ గైడ్ తో ప్రత్యక్ష ప్రాజెక్టుల మీద మహిళలను పనిచేయడానికి కార్యక్రమం అనుమతిస్తుంది. ఇంటి నుండి పని చేయడం వంటి ఎంపికలతో పని సమయాలు కూడా అనువుగా వుంటాయి.

బ్యాక్ ఇన్ ది గేమ్ (B.I.G.)-ఫిలిప్స్

బ్యాక్ ఇన్ ది గేమ్ అనేది ఇటీవల ఫిలిప్స్ ఇండియా చే ప్రారంభించబడిన ఒక విశిష్టమైన అంకురార్పణ, ఇది (జీవన శైలి, వ్యక్తిగత లేదా మరేదైనా కారణంగా తీసుకున్న) కెరీర్ విరామం తరవాత మహిళా ట్యాలెంట్ కు ఫిలిప్స్ లో ఒక కార్పోరేట్ కెరీర్ కు తిరిగి రావడానికి ఒక వేదికను ఏర్పరుస్తుంది. వారు ఫిలిప్స్ లో తమ కెరీర్ లను పునఃప్రారంభించగానే ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం ఈ ఇంటర్న్స్ కు అవసరమైన గురువు ద్వారా ఇవ్వబడే మార్గదర్శకత్వంను అందించడం మరియు అనువైన వాతావరణాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

హోమ్ టు ఆఫీస్ – ఇంటెల్

ఇంటెల్ ఇండియా, కుటుంబ లేదా వ్యక్తిగత అవసరాల కారణంగా తీసుకున్న వృత్తిపరమైన విరామాల నుండి మహిళలను తిరిగి పనిలోనికి తీసుకురావడానికి సహాయం చేసే ఒక విశిష్టమైన ‘హోమ్ టు ఆఫీస్ లేదా H20’ అనే ఉపక్రమణను ప్రారంభించింది. ఈ ఇద్దరు మహిళలు H20తో వారు పనిలోనికి తిరిగి చేరిన కథనాలను వివరించడం చూడండి.

రీస్టార్ట్ -జిఈ ఇండియా

జిఈ యొక్క జాన్ F వెల్చ్ టెక్నాలజీ సెంటర్, బెంగుళూరులోని రీస్టార్ట్ ప్రోగ్రాం ప్రత్యేకించి కెరీర్ బ్రేక్ తీసుకొని వృత్తిలోనికి తిరిగిరావాలనుకుంటున్న మహిళా శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్ల మీద దృష్టి పెడుతుంది.

రీ-కనెక్ట్ - యాక్సిస్ బ్యాంక్

2014 లో, యాక్సిస్ బ్యాంక్ రీ-కనెక్ట్ ను ప్రారంభించింది - ఈ కార్యక్రమం ఎంచుకోబడిన రాష్ట్రాలలో గడచిన 10 సంవత్సరాల్లో వ్యవస్థను వదిలిన మాజీ మహిళా ఉద్యోగులకు ఉద్యోగాలను ఇచ్చింది.


Jayanthi

Share the Article :