లిటిల్ బ్లాక్ బుక్ ( ఎల్ బి బి)-డిల్లీ, బెంగళూరు, గుర్గావ్ నివాసితుల కొరకు ఒక నిర్వహిత సాంస్కృతిక మరియు జీవనశైలి గైడ్- యొక్క వ్యవస్థాపకురాలు అయిన సుచిత సల్వాన్, ఆమె తన వ్యాపారము ప్రారంభించడానికి ఏది తనను పురికోల్పిందో మరియు ఆమె ఇక్కడి నుండి ఎక్కడికి పోవలనుకుంటున్నది అనే దానిని గురించి మనకు చెబుతోంది.
నేను బిబిసి లో పనిచేస్తున్నప్పుడు 2012 లో ఎల్ ఎల్ బి ని ప్రారంభించాను. కావలసినంత జీతంతో పనిచేస్తూ వున్న ఒక యువతినైన నాకు ఢిల్లీ లో ఏమి జరుగుతున్నాయి అని తెలుసుకోవడం చాలా కష్టంగా అనిపించింది. నేను చేసిన లిస్టింగ్ లు గజిబిజిగా వుండి, క్రమానుసారముగా అప్ డేట్ చేయబడక... పనిచేసేవి, కాని చాలా విసుగు కలిగిస్తూ వుండినవి. నేను ఢిల్లీలో కనుగొనాలని ఇష్టపడిన వాటినన్నింటినీ వ్రాతపూర్వకముగా ఉంచడానికి నాకు ఎల్ బి బి అనేది ఒక వేదిక లాంటిది మరియు నా సిఫార్సులతో నేను కనుగొన్న అన్ని అద్భుతమైన విషయాల ద్వారా నేను ప్రజలను బయటకు వెళ్లి ఢిల్లీని కనుగొనమని ప్రోత్సహించగలనని నమ్ముతున్నాను.
ఆర్థిక శాస్త్రములో డిగ్రీ పట్టా పుచ్చుకొన్నాక నేను విజ్ క్రాఫ్ట్ కొరకు చేశాను, ఈ సందర్భముగా కామన్ వెల్త్ గేమ్స్ ప్రారంభ మరియు ముగింపు వేడుకలలో నేను దాదాపు 14000 మందిని నిర్వహణ చేసాను ఇంకా ఈవెంట్ రంగములో అత్యుత్తమమైన దాన్ని కనుగొన్నాను. ఈవెంట్స్ కు పని చేయడము అనేది ఒక వినియోగదారుడికి అద్భుతంగా అనిపించేలా ఎలా చేయాలి మరియు వారిని ఇంటి నుండి బయటకు రప్పించి వారికి ఇంకోలా అయితే వీలుపడని ఒక క్రొత్త అనుభూతిని పొందేలా ఎలా చేయాలి అనే దానిపై మీకు నిజంగా ఒక మంచి దృష్టికోణం ఇస్తుంది. విజ్ క్రాఫ్ట్ తరువాత నేను బి బి సి ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రారంభము కొరకు ఇద్దరు సభ్యుల మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ( నా అధికారి మరియు నేను) తో కలసి పనిచేసాను. ఈ అసాధారణమయిన పని వలన నేను ప్రక్రియల యొక్క విలువను మరియు ఎలా మంచి ప్రోగ్రామింగ్/కంటెంట్ చాలా దూరంగా వెళుతుందో తెలుసుకొన్నాను. ఎల్ బి బి లో పూర్తి సమయము కేటాయించడానికి నేను 2012 చివరలో బిబిసి ని వదలి, అప్పటి నుండి దానిలోనే వున్నాను.
ప్రయాణము చాలా సంతోషకరముగా ఉంది – వ్యక్తిగతంగా కూడా. ఒక గొప్ప సహ-వ్యవస్థాపకుడు దొరకడం నుండి కొంతమంది ఉత్తమ ఏంజిల్ పెట్టుబడిదారులు, సలహాదారులు మరియు పారిశ్రామికవేత్తల నుండి నేర్చుకోవడం వరకు –ఎల్ బి బి అనేది నాకు ఒక వ్యాపారమును నిర్మించడానికే కాకుండా నాకు చాలా నేర్పించిన వ్యక్తులతో ఒక నెట్ వర్క్ ను ఏర్పరచడానికి కూడా ఒక అవకాశం ఇచ్చింది.
ఒక జట్టుగా, మా పాఠకులు ఎల్ బి బి గురించి తెలిపే అభిప్రాయాలను వినడంలో మేము ఉత్తమ క్షణాలను కలిసి ఆస్వాదిస్తాము. ప్రత్యేకంగా యాప్ కు సంబంధించి మేము ఒక పెద్ద విషయములను తీసుకొని వాటిని మా వినియోగదారులకు సులభంగా ఉండేలా చేయడము అనే దానిపై మేము కష్టపడి పని చేసాం. మా ఎల్ బి బి వినియోగదారులు తాము చూసిన అద్భుతమైన స్థలాలు/స్టోర్లు/రెస్టారెంట్లు గురించి చెబుతూ వుంటే వినడం మాకు ఏంతో సంతోషము కలిగిస్తుంది. ఖచ్చితంగా 70 శాతము ఇన్ బౌండ్ ప్రకటన రేటు, మరియు 60% పునరావృతమయ్యే ప్రకటనకర్తలు అనేది మేము పని చేసే బ్రాండ్ లను మేము ఎలా ప్రభావితము చేస్తూ ఉన్నామో తెలుపుతుంది.
ప్రారంభములో రెండు సంవత్సరాలు (2013,2014) కష్టంగా వుండినది, అనగా ఈ సంవత్సరములలో మేము మా దగ్గర ఉన్న నిధులను ఉపయోగిస్తూ మరియు కనిష్ట ఆదాయాన్ని తీసుకుంటూ మరియు మా ఉత్పత్తి పైన పెట్టుబడి పెట్టాము. కాని కంటెంట్ ( విషయము) మరియు డిజిటల్ వ్యాపారము గురించి మేము నేర్చుకొన్నది అసమానమైనది. బ్రాండ్ల విషయంలో వినియోగదారుడికి గల లభ్యతలో అంతరం ఎక్కడ వుందని అర్థం చేసుకోవడానికి నేను ఢిల్లీలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో చాలా సమయం గడిపాను. స్పెక్ట్రం యొక్క రెండు వైపులనూ - వినియోగదారుడి ఆసక్తులు మరియు బ్రాండ్ ఔట్రీచ్- అర్థం చేసుకోగలగడం అనేది మా ఉత్పత్తికి ఆకారం ఇవ్వడంలో గణనీయంగా సహాయపడింది.
ఎల్ బి బి తో మేము ఏమి చేయాలని నిర్ణయించడానికి మాకు ప్రపంచవ్యాప్తంగా వున్న పట్టణ వినియోగదారులు కావాలి. దాని పుట్టుకతోనే, ఎల్ బి బి ఎల్లప్పుడూ మీరు తక్కువగా వెతికి ఎక్కువ చేయడానికి ఒక వేదికగా ప్రజాదరణ పొందింది. మేము 2016 సంవత్సరపు మొదటి త్రైమాసికములో ఆరంభించే ముఖ్య లక్షణాలలో వ్యక్తిగతీకరణ ( ప్రతి వినియోగదారుడికి ఒక ప్రత్యేకమైన మరియు వారి ఆసక్తులకు అనుగుణంగా వుండే జవాబు ఉండటము), చూసుకోనడానికి మరింత సమాచారము అందుబాటులో వుండేలా ఎల్ బి బి కి కంటెంట్ పంపేవారిని చాలా మందిని జతచేయడం, మరియు చేయాల్సిన విషయమై మీరు ఎక్కువ పేజీలు చూడక్కర లేకుండేలా కన్జంప్షన్ లూప్ ను మూయడము అనేవి వుంటాయి.
ఖచ్చితంగా, మేము ఇండియాలో ప్రతి పెద్ద నగరంలో ఎల్ బి బి ఉండాలని కోరుకుంటున్నాము – మరియు మీరు వచ్చే సంవత్సరము చివరకంతా ముంబాయి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ మరియు గుర్ గావ్ లో మమ్మల్ని చూస్తారు.
నేను భావించే పెద్ద తేడాలు:
ఎ. మా కంటెంట్ సాంకేతికత మద్దతు కలిగి వున్నది. ఉత్పత్తి మరియు వ్యాపారమునకు చేరే విధానము లో సాంకేతికత ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది, ఏమంటే గత 6 నెలలుగా మేము విశేషంగా పెరగడానికి కారణము ఏమిటంటే మేము మా కంటెంట్ సోర్సింగ్ మరియు బ్రాండ్ అవుట్ రీచ్ లో సాంకేతికతను జోడించిన విధానం.
బి. మేము ‘ చేయవలసిన విషయాలు”ను సంపూర్ణంగా కవర్ చేస్తాము. ఎల్ బి బి లో ఎక్కడ తినడము గురించి లేక ఏ ఈవెంట్ కు హాజరు కావాలి అన్నది మాత్రమే. మేము ‘చేయవలసిన విషయాలు’ ను జీవన శైలి, షాపింగ్, కార్యకలాపాలు, ప్రయాణము మరియు ఇంకా మరిన్నిటిని కవర్ చేసే ఒక తరగతిగా చూస్తాం. వినియోగదారులు మా వద్దకు మళ్ళీ మళ్ళీ రావడానికి కారణము ఇదే ఎందుకంటే మేము వారికి ఆసక్తి వున్న విషయాలలో వారు ఏమి చేయాలో నిర్ణయించుకొనేందుకు సాయపడతాము కాబట్టి.
ఎల్లప్పుడూ మీరు మీ కంటే చురుకైన మరియు తెలివైన వారితో గడపండి మరియు మీకు అభినందన కూర్చే మీకు సంబధించిన ఒక విషయమై మీరు ఒక విశేష నైపుణ్యత కలిగి వుండండి. ఇది వేరేవాటి లాంటిది కాని ఒక విద్య – నేను నా కోసం చేసుకొన్న అత్యంత మంచి విషయము ఇదే.