“మీరు ఏమి చేస్తారు?”
“నేను వరుసగా బహుళ విధులు నిర్వర్తించే వ్యక్తిని. నేను ఒక ఔత్సాహిక వ్యాపారస్తురాలిని, గృహిణిని, మరియు తల్లిని, మళ్ళీ కాబోయే విద్యార్ధిని ఇంకా నేను ప్రవృత్తి రీత్యా ఒక ఔత్సాహిక రచయిత్రిని.”
చాలా మంది ప్రజలతో నా సంభాషణ ఇలానే మొదలవుతుంది. నేను జీవితములో చాలా విషయాలు చేయడానికి ఆసక్తి కలిగి వున్నాను, నాతో మాట్లాడుతున్న వ్యక్తి నన్ను అన్నిటిని తన అజమాయిషీ లో ఉంచుకొన్న రేపటి-తరము తల్లి అనుకొంటాడు. వారికి తెలియనిది ఒకటే, నేను నిర్వహించగల అన్నిటి గురించి తెలియకపోవడం, వాటిని సమతుల్యము చేయడం అనేది నా జాబితాలో అన్నిటికంటే పైన లేదు. ఎందుకు? ఎందుకంటే నేను చేయలేను.
అవును, నేను అన్ని విషయాలపై అజమాయిషీ కలిగి వున్నానని అనుకొన్న రోజులు వున్నాయి అంతే నా కూతురుకు జ్వరము వస్తూ వుందని ఇంటి నుండి ఒక ఫోన్ కాల్ వస్తే, నేను మొత్తము పోగొట్టుకుంటాను. నేను ఫోన్ పెట్టేయక ముందే అపరాధ భావములోకి వెళ్ళిపోతాను. తాజా మాతృత్వ స్వభావం అనే ఇలాంటి దానితోనే యుక్తవస్కులైన తల్లులు తయారు అవుతారు. ఒక లేశమైనా తప్పు భావన లేకుండా అది ఎప్పుడూ పూర్తి కాదు.
నేను నా బిడ్డకు తగినంత చేస్తూ వున్నానా? నేను నా బిడ్డతో కావలసినంత సమయము గడుపుతూ వున్నానా? నేను ఒక మంచి కూతురు/కోడలు గా వుంటున్నానా? నేను ఒక మంచి భార్యగా వుంటున్నానా? నేను ఒక మంచి మహిళా యజమానిగా వుంటున్నానా? చాలా అధిక లక్ష్యాలతో నేను నా జీవితాన్ని వృధా చేసుకుంటున్నానా? నాకు వీటికి అవును అని సమాధానము చెప్పడానికి సరిపోయినంత శక్తి వుంటే, అప్పుడు నేను ఒక మంచి మనిషిగా వుంటున్నానా మరియు నాకు కొరకు నేను ఏదైనా చేసుకొంటూ వున్నానా? లేదు.
అదే, మీ కోసం మీరు ఖచ్చితంగా కొంతైనా చేసుకోవడం (నేను సరిపోయినంత అని బలవంతపెట్టలేను) అనేది మహిళలకు తప్పనిసరి. అది మొదటి ప్రశ్న కావాలి. విచారకరంగా మనకు అది చివరి ప్రశ్న అయినది. నేను కష్టమైన మార్గములో పాఠము నేర్చుకోవలసి వచ్చింది.
మాతృత్వం యొక్క మరియొక వైపు అయిన పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కొరకు ఎవరూ మిమ్మల్ని సిద్ధపరచరు. అవును. దానిని నిర్ధారించడానికి నాకు ఒక సంవత్సరము పట్టినది మరియు దాని నుండి కోలుకోవటానికి మరికొన్ని నెలలు పట్టినది. ఈ సమయములో, నేను చేయవలసిన పనులు వుండినాయి. ఎందుకంటే నేను తల్లిగా వుండలేకపోయాను లేక వ్యాపారము నడపలేకపోయాను లేక నేను మామూలుగా చేసే పనులు చేయలేకపోయాను. నాకు పాజ్ బటన్ లేకుండింది.
బయటి వారిగా, ఏదీ ముఖ్యం కాదు. నీవు రూములో నిద్రపోతూ ప్రపంచానికి దూరంగా ఉన్నంత కాలము మీ పూర్తి జీవితమంతా మట్టిపాలు కావచ్చును. ప్రపంచానికి నేను ఒకటే వ్యక్తిగావుండినాను - నేను పనిచేసాను, పార్టీ చేసాను, వండాను మరియు నేను చేయవలసినది అంతా చేసాను. కాని నాకు, నా ప్రపంచము తలక్రిందులైండింది. దీని గురించి నా భర్తకు మరియు నా కుటుంబ సభ్యులకు చెప్పడానికి నాకు నెల పట్టినది ఎందుకంటే, నేను ప్రతి ఒక్కరూ ఆధారపడే దానిని కాబట్టి.
నేను బలహీనముగా, బాధాకరముగా, హానికి గురి అయ్యే అవకాశం గల దానిగా, అవివేకిగా మరియు కోపముగా అనుభూతి చెందాను. నేను కొంతకాలము వృత్తిపరమైన సహాయం తీసుకొని, ఈ రోజు వరకు నాతో పాటు వున్న ఒక అతి ముఖ్యమైన విషయము నేర్చుకొన్నాను. మీ పైన మీరు సానుభూతి చూపుకోండి. మీతోనే ప్రారంభించండి. మిగతా అందరూ మీ బిడ్డతో సహా వేచి వుంటారు. ఆమెకు తన పిల్లలను ప్రేమించడానికి ముందు తనను తాను ఇష్టపడే ఒక తల్లి కావాలి. నేను బాగా లేకపోయింటే, ఏవిధంగా నేను నా కూతురిని ఆరోగ్యంగా మరియు ప్రేమగా పెంచగలిగేదాన్ని?
నాకు దాదాపు 34 సంవత్సరముల వయసులో పిసిఓడి మరియు 17 వ సంవత్సరముల వయసులో థైరాయిడ్ నిర్ధారించబడ్డాయి. దానికి తోడు క్రుంగి పోవటము మరియు పిఎంఎస్ వలన మీరు ఒక విపత్తు వైపుగా బయలుదేరారు. నాకు నిజంగా ఆ విధంగానే జరిగింది. ఇంక ఏడవలేను అన్నంత వరకు ఏడ్చాను. నేను అందరితో మాట్లాడటము మానివేశాను. దానితో పోరాడిన ఒక ఫ్రెండ్ తో మాట్లాడిన తర్వాత నేను దాని గురించి బహిరంగంగా మాట్లాడగలిగాను. అతను కూడా అదే విషయము చెప్పాడు. మొదట మీరు. ప్రపంచం వేచి వుంటుంది.
అందువలన నన్ను నేను ఒక ప్రాజెక్ట్ గా తీసుకోన్నాను, నాయొక్క భావోద్వేగ శ్రేయస్సు మరియు శారీరక ఆరోగ్యము దిశగా పనిచేయడము మొదలు పెట్టాను. నేను వ్రాయడము మొదలుపెట్టాను మరియు నేను నా అన్ని వ్యతిరేక భావనలను ఒక ఉత్పత్తిదాయకమైన రచన వైపుగా మళ్ళించగలను అని గ్రహించాను. నేను జాగింగ్ మరియు యోగా చేయడము మొదలు పెట్టాను మరియు అది నా జీవనగతిని మార్చి వేసింది.
నాతో నేను సమయమును గడపటము నేర్చుకున్నాను. నేను చేయని మరియు చేయలేని వాటికీ కాదు అని చెప్పాను. మళ్ళీ మళ్ళీ నేను ఎక్కువగా పనిచేసినప్పుడు మరియు ఎక్కువగా చుట్టుముట్టబడినపుడు నేను దాని లోనికి జారిపోయేదానిని. కాని ఏదో విధంగా నేను దాని నుండి బయట పడే మార్గము నేర్చుకున్నాను. నాకు దీని నుండి బయటకు పడే ఏకైక మార్గము – నాకు ఒకే ఒక్క జీవితము వున్నది, పరిమిత దినములు మరియు అపరిమితమైన కలలు వున్నాయి మరియు వాటిని నెరవేర్చగల ఏకైక వ్యక్తి నేను మాత్రమే అనే ఆలోచన.
దానిని నేను ఎన్నుకోనడములో వున్నది. నేను నా యొక్క అత్యుత్తమమైన రీతిగా వుండాలి లేదా మందులు తీసుకొంటూ ఉండటాన్ని ఎన్నుకోవాలి. మీరు దేనిని నమ్ముతారు అనేదాని మీద ఇది ఆధారపడుతుంది. నేను కొండలను కదిలించగలను అని అనుకొన్న రోజులు వున్నాయి మరియు నేను పడక నుండి కదలలేను అని అనుకున్న రోజులూ వున్నాయి. ఆ రెండూ సందర్భాలలో ఉండింది నేనే. నేను కదలాలని ఎంచుకున్నాను. ఇంకా నేను మనసు పెట్టిన ప్రతీ దాన్ని సాధించే వరకు నేను ఆగి పోవటము అంటూ జరగదు.
వరుసగా బహుళవిధులు చేయువారు:1, క్రుంగిపోవటము: 0